ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి జిల్లాకు ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం

ABN, First Publish Date - 2021-10-16T23:43:20+05:30

వరంగల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కొరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థలాన్ని పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: వరంగల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కొరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి జిల్లా కు ఓ కార్యాలయం చొప్పున పార్టీ కార్యాలయాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వరంగల్ పార్టీ కార్యాలయం నిర్మాణం కొరకు సరైన స్థలం దొరకకపోవడం వలన ఆలస్యమైందని అన్నారు. ప్రస్తుతం సిటీ లోని ఒక స్థలాన్ని పరిశీలించామని చెప్పారు.


త్వరలో స్థలాన్ని గుర్తించి నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. వరంగల్ మినహా మిగతా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు సిద్ధం అవుతున్నాయని తెలిపారు.పార్టీ అధినేత సీఎం కేసిఆర్ లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-16T23:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising