ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బమ్మెర పోతనకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-09-15T20:45:22+05:30

బమ్మెర పోతనకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వరంగల్: సహజ కవి బమ్మెర పోతనామాత్యుడి జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ బుధవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజును భాగవత దినోత్సవంగా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు.మహా భాగవతము రచించిన, తెలుగు వారు గర్వించదగ్గ మహాకవి బమ్మెర పోతన పోతన జన్మించిన గ్రామం బమ్మెర తన నియోజకవర్గం లో వుండటం నా అదృష్టం గా భావిస్తున్నట్టు తెలిపారు. ఇంత చారిత్రాత్మక, కవితాత్మక, తెలుగుని ప్రపంచ భాష గా నిలిపిన ప్రముఖులు ఉన్న ప్రాంతం తన పాలకుర్తి నియోజకవర్గమని అన్నారు. అది కవి, తొలి తెలుగు విప్లవ కవి, ప్రజల భాషలో గ్రంథాలు రాసిన పాల్కురికి సోమనాథుడు, సహజ కవిగా పేరు పొందారని అన్నారు.  


తన గ్రంథాలను రాజులకు అంకితం ఇవ్వడానికి ఒప్పుకోని, తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్నారని తెలిపారు. కవి బమ్మెర పోతనామాత్యుడు జన్మించిన, వాల్మీకి ఆశ్రమం, సీతా రాముల తనయులు లవకుశులు జన్మస్థానం వాల్మీకి పురం - వల్మీడి, పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సీఎం కేసిఆర్ టూరిజం హబ్ చేయాలని నిర్ణయించారని తెలిపారు. సీఎం కేసిఆర్ నిర్ణయం మేరకు అభివృద్ది పనులు కూడా చకచకా సాగుతున్నాయన్నారు. కేసిఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ది చేస్తున్నామని వెల్లడించారు.  పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-15T20:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising