ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ పై ప్రభుత్వ జీవో సంతోషకరం: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-09-12T22:46:48+05:30

లంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది. దీనికి స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన జన్మించారు.1985 సెప్టెంబర్ 10వ తేదీన మరణించారు.


తెలంగాణ పోరాట యోధులను గుర్తించి, తగిన గౌరవం కల్పించడంలో సీఎం కేసీఆర్ ఎప్పుడు ముందుంటారని మంత్రి అభిప్రాయపడ్డారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన వీర వనిత చాకలి ఐలమ్మ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఆమె చేసిన సాయుధ పోరాటమే తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని మంత్రి అన్నారు.

Updated Date - 2021-09-12T22:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising