ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజంజాహి మిల్స్ ప్రాంగణంలో కలెక్టరేట్ కార్యాలయం: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-08-30T20:05:01+05:30

నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.హన్మకొండలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్ లో సోమవారం నాడు వరంగల్ జిల్లా కలెక్టర్ హరిత,  రెవెన్యూ అధికారులతో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం భవన నిర్మాణానికి కావలసిన భూమి సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. 


వరంగల్ రూరల్ జిల్లా స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా ఏర్పడి నందున జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావలసిన భూమిని వెంటనే సేకరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, అందువల్ల వెంటనే సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావాల్సిన భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. భూసేకరణలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డివో మహేందర్ జీ, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-30T20:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising