ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి:మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-08-10T22:14:09+05:30

పెన్షన్ ను పొందేందుకు అర్హత గల వారిని ఎంపిక చేయడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెన్షన్ ను పొందేందుకు అర్హత గల వారిని ఎంపిక చేయడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అర్హులను ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనా్నరు.  తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లో ఉన్న ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. 


రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ఉద్యోగుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన అన్నారు. గ్రామపంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇతర సాగునీటి వనరులను వినియోగించుకుని వర్షాకాలంలో నాటిన మొక్కల వాటరింగ్ చేయాలని ఆయన కోరారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా  చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. 


ఈ విషయంలో ఎప్పటికప్పుడు పనుల సోషల్ ఆడిట్ మానిటరింగ్ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి దయాకర్ రావు అదేశించారు. 

Updated Date - 2021-08-10T22:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising