ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో అన్నివర్గాలకు న్యాయం చేశాం

ABN, First Publish Date - 2021-04-23T20:30:47+05:30

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేసినట్టు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేసినట్టు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తెలిపారు. అన్నికులాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనరల్‌ స్థానాల్లో కూడా బీసీలకు టికెట్‌లు ఇచ్చామని అన్నారు. వరంగల్‌ పట్టణ ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ఆదరించాలన్నారు. కరోనా సమయంలోనూ, వరదలు సంభవించినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌ ప్రజలను అన్ని విధాలా ఆదుకుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం చేయని అనేక రకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. 


సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌ బోగస్‌ ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. నిజానికి బీజేపీ అన్నదే అబద్ధాల పార్టీఅని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌ , మంత్రి కేటీఆర్‌ను నమ్ముకుందాం, వారు ఇచ్చిన మాట ప్రకారం మంచి అభివృద్దిని చేసి చూపించారని అన్నారు. ఎప్పటికైనా మన ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని మన గురించి ఆలోచించే పార్టీఅని చెప్పారు. ప్రస్తుతం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసే పరిస్థితి లేదు. అభ్యర్ధులను కాదు మంత్రులు, ఎమ్మెల్యేలను చూడండని ఆయన కోరారు. మమ్మల్ని నమ్మండి , అభివృద్ధి బాధ్యత మాదని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. క


రోనా క్లిష్ట పరిస్థితిలో ఇంజన్‌లు, ఆక్సీజన్‌, వ్యాక్సిన్‌లు చాల తక్కువ స్థాయిలో కేంద్రం ఇస్తోందన్నారు. ఆక్సీజన్‌ కొరతతో ఎవరైనా మరణిస్తే కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. బీజేపీ మూర్ఖత్వపు పార్టీఅని తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో వరంగల్‌ ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసి మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T20:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising