ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ కూడా గొప్ప అంబేద్కర్‌ వాది- ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-01-27T21:04:46+05:30

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా గొప్ప అంబేద్కర్‌ వాది అని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా గొప్ప అంబేద్కర్‌ వాది అని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అంబేద్కర్‌ స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా అనేక పధకాలు ప్రవేశపెడుతున్న కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సబ్‌ప్లాన్‌ పెట్టి , బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఆయా వర్గాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం కావద్దన్న లక్ష్యంతో నియమ నిబంధనలు కూడా కఠినంగా అమలుచేస్తున్నారని ఆయన మీడియాతోమాట్లాడుతూ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లకు నష్టం కలగకుండానే అగ్రవర్ణాల్లోనూ ఆర్ధిక బలహీనత ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించిన ఘనత కూడా కేసీఆర్‌దేనని చెప్పారు. 


సబ్బండ వర్గాల కుల వృత్తులను కాపాడుతూ అందరి అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. 500 జనాభా కలిగిన ప్రతి పల్లెలను గ్రామ పంచాయితీలుగా చేసి అణగారిన లంబాడీ వర్గాలకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించాని అన్నారు. అంబేద్కర్‌ స్పూర్తితో అన్ని నామినేటెడ్‌ పోస్టులు, ప్రతినిధుల ఎన్నికలోనూ అన్నివర్గాలకు సమంగా రిజర్వేషన్లు క్పిస్తున్న మహనీయుడు కేసీఆర్‌ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-27T21:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising