అభివృద్ధి పథకాలలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల పాత్ర కీలకం
ABN, First Publish Date - 2021-01-11T19:30:05+05:30
ప్రభుత్వ అభివృధ్ధి పథకాల అమలు లో పంచాయతీ రాజ్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల పాత్ర ఎంతో
హైదరాబాద్: ప్రభుత్వ అభివృధ్ధి పథకాల అమలు లో పంచాయతీ రాజ్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్య మైనదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బాగా పని చేస్తున్నారని ఆయన అభినందించారు. సోమవారం తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర ఎంపిడిఓ ల సంఘం నూతన సంవత్సరం 2021 క్యాలెండర్లను, డైరీలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ప్రతిఏటా క్రమం తప్పకుండా డైరీ, క్యాలెండర్ తెస్తూ, ఉద్యోగుల్లో ఐక్యతను సాధిస్తూ పని చేస్తున్న తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర ఎంపిడిఓ ల సంఘాల సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఇంజనీర్ అసోసియేషన్ ల ప్రతినిధులు సూర్య ప్రకాష్, వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-11T19:30:05+05:30 IST