ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్: మంత్రి ఈటల

ABN, First Publish Date - 2021-04-18T19:22:37+05:30

రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 ఏళ్లకు పైగా ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 2.70 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్పత్తి, రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని, వ్యాక్సిన్ సమస్యను పరిష్కరించాలని కోరామన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరతలేదని, అయితే ఆక్సిజన్‌ కూడా కేంద్రం పరిధిలోనే ఉందన్నారు.


ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రోటోకాల్‌ ప్రకారం కరోనా ట్రీట్‌మెంట్ ఇవ్వాలని మంత్రి ఈటల సూచించారు. అవసరం లేకపోయినా ఆక్సిజన్ పెట్టవద్దన్నారు. రెమిడెసివిర్ ఉత్పత్తి చేసే యాజమాన్యాలతో మాట్లాడామని, సోమవారం నుంచి రెమిడెసివిర్ కొరత లేకుండా చర్యలు చేపడతామన్నారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో రెమిడెసివిర్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఐదారు ఆస్పత్రుల్లోనే బెడ్స్ నిండాయని, 60 వేల బెడ్స్ ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో 50 శాతం బెడ్స్ ఇతర రాష్ట్రాల వారు ట్రీట్‌మెంట్ పొందుతున్నారని, చికిత్స పొందుతున్న ఇతర రాష్ట్రాల వారిని వెళ్ళమని చెప్పలేమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Updated Date - 2021-04-18T19:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising