ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనసులు కలిసే.. మనువు జరి‘గే’..!

ABN, First Publish Date - 2021-12-20T09:40:20+05:30

ప్రేమకు కులమతాలు, వయోభేదాలే కాదు.. లింగభేదాలు కూడా లేవని నిరూపించిందో జంట. ప్రేమలో పడ్డ ఇద్దరు పురుషులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హైదరాబాద్‌లో ఒక్కటైన ‘గే’ జంట

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 19, (ఆంధ్రజ్యోతి): ప్రేమకు కులమతాలు, వయోభేదాలే కాదు.. లింగభేదాలు కూడా లేవని నిరూపించిందో జంట. ప్రేమలో పడ్డ ఇద్దరు పురుషులు.. తమకు ఎదురైన కష్టాలను దాటుకుని.. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లో బహిరంగంగా జరిగిన తొలి ‘గే’ వివాహం ఇదే కావడం గమనార్హం. నగర శివార్లలోని ఓ రిసార్టులో శనివారం రాత్రి ఈ వేడుక ఘనంగా జరిగింది.


పంజాబ్‌కు చెందిన ప్రేమ అలియాస్‌ అభయ్‌ డంగ్‌ సంగ్‌.. నగరంలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తుండగా.. పశ్చిమబెంగాల్‌కు చెందిన సుప్రియో చక్రవర్తి ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వీరు ప్రేమలో కొనసాగుతున్నారు. పెళ్లి చేసుకోవాలన్న వీళ్ల నిర్ణయాన్ని ఇరువైపుల తల్లిదండ్రులూ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా వీళ్లు పట్టువీడకుండా ప్రయత్నించారు. వీళ్ల ప్రేమలోని నిజాయితీని గుర్తించిన ఇరువురి తల్లిదండ్రులు.. ఎట్టకేలకు పెళ్లికి అంగీకరించారు. వివాహానికి హాజరై.. కొత్త జంటను ఆశీర్వదించారు.



Updated Date - 2021-12-20T09:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising