ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృత్యాలు చేసిన మహిళా ఉపాధ్యాయులకు మెమో జారీ

ABN, First Publish Date - 2021-03-28T02:10:36+05:30

జిల్లాలోని ఏడుగురు మహిళా ఉపాధ్యాయులకు మెమో జారీ అయింది. జిల్లా కేంద్రంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంచిర్యాల: జిల్లాలోని ఏడుగురు మహిళా ఉపాధ్యాయులకు మెమో జారీ అయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్‌లో టీఆర్ఎస్ పాటలు పెట్టుకుని మహిళ ఉపాధ్యాయులు నృత్యాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేసి దాని ఆధారంగా వారికి మోమో జారీ చేశారు. 


 ఉపాధ్యాయులకు ప్రభుత్వం మెరుగైన పీఆర్సీని ప్రకటించినందుకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 22న జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభావేదికపై టీఆర్‌ఎస్‌ పార్టీ పాటలకు మహిళ ఉపాధ్యాయులు నృత్యాలు చేశారని ఆరోపణలు వచ్చాయి.  

నృత్యాలు చేసిన  ప్రభుత్వ టీచర్స్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు, గొడిసెల పవన్‌కళ్యాణ్‌, దుంపల రంజిత్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏఓకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికార పార్టీ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలను చిత్రీకరించారన్నారు. జిల్లా అధికారులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-28T02:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising