ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమణా.. రండి

ABN, First Publish Date - 2021-07-09T08:05:49+05:30

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌. రమణ గులాబీ గూటికి చేరడం ఖాయమైంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాత ఈనెల 11న ఆయన కారెక్కనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌరవమిస్తామని కేసీఆర్‌ ఆహ్వానం

ఎర్రబెల్లితో కలిసి సీఎంతో భేటీ

త్వరలో గులాబీ గూటికి రమణ


హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌. రమణ గులాబీ గూటికి చేరడం ఖాయమైంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాత ఈనెల 11న ఆయన కారెక్కనున్నారు. తొలుత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసానికి వెళ్లిన రమణ, ఆయనతో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. సుమారు అరగంటపాటు ఈ సమావేశం కొనసాగినట్లు సమాచారం. రమణకు ఎమ్మెల్సీగా చాన్స్‌ ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారని ఎల్‌. రమణ తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం రమణ మాట్లాడుతూ ‘మీరు పార్టీలోకి రండి, తగిన గౌరవమిస్తాం’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు.


‘నాకు వదలిపెట్టు, నేను చూసుకుంటా’ అని ఆయన అన్నట్టు చెప్పారు. ‘మనం రమణను వాడుకోవాలి. అన్ని సామాజికవర్గాలకు ఎంతో కొంత న్యాయం చేశాం. పద్మశాలి సామాజికవర్గానికి పార్టీలో రాష్ట్రస్థాయి నాయకుడు లేరు. ఆ లోటును రమణతో భర్తీ చేసుకుందాం. ఆయన్ను బాగా వాడుకోవాలి’ అని కేసీఆర్‌ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

Updated Date - 2021-07-09T08:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising