ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్య జీవితంలో యోగా భాగం కావాలి

ABN, First Publish Date - 2021-06-22T04:59:18+05:30

బాల్యం నుంచే యోగా జీవితంలో భాగం కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు.

హుస్నాబాద్‌లో యోగాసనాలు వేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత 

పలు మండలాల్లో ఘనంగా యోగా వేడుకలు 

హుస్నాబాద్‌/సిద్దిపేట/సిద్దిపేటఎడ్యుకేషన్‌/చిన్నకోడూరు/చేర్యాల/మద్దూరు, జూన్‌ 21 : బాల్యం నుంచే యోగా జీవితంలో భాగం కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ మండలంలోని హుస్నాబాద్‌ యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అలాగే టెన్నిస్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐ ఎస్‌.శ్రీధర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ బూట్ల రాజమల్లయ్య, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు ఉన్నారు. సిద్దిపేటలో నెహ్రూ యువకేంద్రం, సిద్దిపేట ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో యోగాడేను నిర్వహించారు. నెహ్రూ యువకేంద్ర జిల్లా యువజన అధికారి బిన్సీ, కిరణ్‌కుమార్‌, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అక్బర్‌నవాబ్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ పాల్గొన్నారు. అలాగే స్థానిక ఇందిరానగర్‌లో పతంజలి యోగా స్వాభిమాన్‌ ట్రస్టు, నెహ్రూయువ కేంద్రాల ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పతంజలి యోగా, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాంరాజ్‌ హనుమాన్‌ ట్రస్టు భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సిద్దిపేటలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఇందులో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌.ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ హుస్సేన్‌ ఉన్నారు. చిన్నకోడూరు మండలంలో నెహ్రూ యువకేంద్రం బ్లాక్‌ వాలంటీర్‌ సురేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో, చేర్యాల పట్టణంలో సేవాభారతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా శిక్షకుడు మంతపురి గణేశ్‌ స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో స్థానికులతో ఆసనాలు వేయించి యోగా ప్రాముఖ్యత వివరించారు. మద్దూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట యోగా వాలంటీర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో సర్పంచ్‌ జనార్ధన్‌రెడ్డి, మోడల్‌ స్కూల్‌ పీడీ ప్రేమ్‌కుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు శేఖర్‌ ఉన్నారు. 

బియ్యం గింజలతో యోగా చిత్రం

గజ్వేల్‌టౌన్‌, జూన్‌ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్‌ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు బియ్యం గింజలను ఉపయోగించి యోగా చేస్తున్న వ్యక్తి చిత్రాన్ని చిత్రించారు. 

Updated Date - 2021-06-22T04:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising