ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 మంది నామినేషన్ల ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-04-21T05:08:11+05:30

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన అప్పిలేట్‌ కార్యాలయంలో ఒకే అప్పీల్‌ వచ్చింది. 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిద్దిపేటలో ఒకే ఒక్క అప్పీల్‌

 ఉపసంహరణకు నేడు తుదిగడువు


సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 20: సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన అప్పిలేట్‌ కార్యాలయంలో ఒకే అప్పీల్‌ వచ్చింది. 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అందులో 6వ వార్డుకు చెందిన పొశంగారి సత్యంరెడ్డి, 13వ వార్డు నుంచి రఫీయుద్దీన్‌, నిజాముద్దీన్‌, షాదుల్‌ బాబా, ఇక్బాల్‌ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలాగే 15వ వార్డు నుంచి గురుజాల ఉమారాణి, 17వ వార్డు నుంచి కొత్తపల్లి గొణెమ్మ, 25వ వార్డు నుంచి పల్లె మౌనిక, 30వ వార్డు నుంచి ప్రియాంక, వజీర్‌, 33వ వార్డు నుంచి రఫాతూనిస, 38వ వార్డు నుంచి శంకర్‌ లింగం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే అప్పీలేట్‌ కార్యక్రమంలో గరిపల్లి లక్ష్మి తన నామినేషన్‌ తిరస్కరణకు గల కారణాలు అప్పీలేట్‌ అఽధికారి హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డికి అప్పీల్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుది గడువు. 


గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ 12వ వార్డులో ఒక నామినేషన్‌ ఉపసంహరణ


గజ్వేల్‌, ఏప్రిల్‌ 20: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికలో గుడ్డోజు పరమేశ్వరాచారీ మంగళవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడని కమిషనర్‌ వెంకటగోపాల్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కరీమొద్దీన్‌ తెలిపారు. కాగా ఒక్క నామినేషన్‌ కూడా తమ పరిశీలనలో తిరస్కరణకు గురి కాలేదన్నారు. 


 

Updated Date - 2021-04-21T05:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising