ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల ధరలకు రెక్కలు

ABN, First Publish Date - 2021-06-18T05:21:29+05:30

వారం క్రితం వరకు కూరగాయలకు ధర లేక సాగుదారులు అల్లాడారు. ఇక రెండు రోజుల నుంచి రేట్లు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు జంకుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌,జూన్‌ 17: వారం క్రితం వరకు కూరగాయలకు ధర లేక సాగుదారులు అల్లాడారు. ఇక రెండు రోజుల నుంచి రేట్లు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు  జంకుతున్నారు. వారం క్రితం కిలో పచ్చిమిర్చి రూ.30 నుంచి 40 వరకు ఉంటే గురువారం కిలో రూ.80చొప్పున విక్రయించారు. కిలో టమాట రూ.15 నుంచి అమాంతం రూ.30కి పెరిగింది. బీరకాయలు, చిన్న చిక్కుడు, క్యాప్సికం, వంకాయ, దొండకాయ, బెండకాయలు కిలో రూ.40 ఉండేవి. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి 80 వరకు విక్రయిస్తున్నారు. కొత్తిమీర కరివేపాకు ధరలు కూడా పెరిగాయి. వర్షాలు కురుస్తుంటే ధరలు అమాంతం పెంచడం ఏంటని కొనుగోలుదారులు ఆందోళనచెందుతున్నారు. వ్యాపారులు మాత్రం వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, వినియోగదారుల సౌలభ్యం కోసం దూరప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నామని చెబుతున్నారు. 

Updated Date - 2021-06-18T05:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising