ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్‌చేస్తే ఎందుకు స్పందించరు?

ABN, First Publish Date - 2021-10-22T05:14:11+05:30

విద్యుత్‌ సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఎందుకు స్పందించరని విద్యుత్‌ ఏఈని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచులు నిలదీశారు.

విద్యుత్‌ ఏఈని ప్రశ్నిస్తున్న సర్పంచులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్వసభ్య సమావేశంలో విద్యుత్‌ ఏఈని నిలదీసిన ఎంపీపీ, సర్పంచులు 

చిల్‌పచెడ్‌, అక్టోబరు 21 : విద్యుత్‌ సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఎందుకు స్పందించరని విద్యుత్‌ ఏఈని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచులు నిలదీశారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు అభివృద్ధి పనుల గురించి వివరించారు. కాగా విద్యుత్‌ ఏఈ రాంబాబు విద్యుత్‌శాఖ పనుల గురించి వివరిస్తుండగా.. పలువురు సర్పంచులు కల్పించుకుని విద్యుత్‌ అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోయినా బాగు చేయించేందుకు అన్ని ఖర్చులు తామే భరిస్తున్నామని అన్నారు. ఏదైనా సమస్య వచ్చి ఏఈకి ఫోన్‌చేస్తే ఎందుకు స్పందించరని ఎంపీపీ ప్రశ్నించారు. మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి శ్రద్ధచూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశిప్రభ, తహసీల్దార్‌ సహదేవ్‌, ఎంపీవో పోలేశ్వరరాజు, ఎస్‌ఐ మల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ విశ్వాంబర్‌, డిప్యూటీ తహసీలాదర్‌ స్టీఫెన్‌, డీఈ కిషన్‌, పీఆర్‌ఏఈ మధుబాబు, ఏపీవో శ్యాంకుమార్‌, ఏపీఎం ప్రేమలత, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మార్తా, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ జ్యోతి, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising