ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వట్టికోట ఆళ్వారు స్వామి సేవలు మరువలేనివి’

ABN, First Publish Date - 2021-11-02T04:40:20+05:30

తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి అని, ఆయన సేవలు మరువలేనివని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల గ్రంథాలయ సంస్ధ చైర్మన్లు చంద్రాగౌడ్‌, నరహరిరెడ్డి కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, నవంబరు1: తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి అని, ఆయన సేవలు మరువలేనివని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల గ్రంథాలయ సంస్ధ చైర్మన్లు చంద్రాగౌడ్‌, నరహరిరెడ్డి కొనియాడారు. గ్రంథాలయ ఉద్యమకారుడు ఆళ్వారు స్వామి 106 జయంతి సందర్భంగా సోమవారం మెదక్‌, సంగారెడ్డి జిల్లా శాఖ గ్రంథాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయుడిగా, కథకుడుగా, నవలాకారుడిగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంలో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన వట్టికోట సాహిత్య కృషి అజరామరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మెదక్‌ కౌన్సిలర్‌ కృష్ణారెడ్డి, అరవింద్‌గౌడ్‌, గ్రంథాలయ సిబ్బంది నరేందర్‌ రెడ్డి, శంకర్‌, మురళి, ఆదిశ్రీనివాస్‌, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, సిబ్బంది వంశీకృష్ణ, వెంకటరమణ, శ్రీనివాస్‌, ప్రశాంత్‌, వరలక్ష్మి, సావిత్రి, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-02T04:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising