ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-09-17T04:56:48+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎస్టీవో కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్టీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరసన

సదాశివపేట/నారాయణఖేడ్‌/జహీరాబాద్‌, సెప్టెంబరు 16 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఎ్‌సయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎస్టీవో సంపత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాయిలు మాట్లాడుతూ వారంరోజులుగా జీతాలు ఆలస్యంగా వేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.సాయితేజ, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు జి.కేశవరావు, ఆర్‌.శ్యామ్‌ప్రసాద్‌, బి.కృష్ణయ్య, జావేద్‌ అలీ, టి.బాల్‌రాజ్‌, మునిష్‌, ఎ.వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు. టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణఖేడ్‌ మండలంలోని ఎస్టీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు గురువారం నిరసన తెలిపారు. టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, జిల్లా కార్యదర్శులు నరేష్‌, ఏశప్ప, నర్సయ్య పాల్గొన్నారు. జహీరాబాద్‌లోని ఎస్టీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి ఏఎస్టీవో శ్రీనివా్‌సరెడ్డికి వినతిపత్రం అందజేశారు. టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సువర్ణ, జిల్లా కార్యదర్శులు శ్యామయ్య, జగన్‌మోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T04:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising