ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్‌ కథనం వీడియో మార్పింగ్‌ కేసులో ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2021-04-17T05:48:45+05:30

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన కథనాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తూప్రాన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, ఏప్రిల్‌ 16: ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన కథనాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తూప్రాన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌పై గతనెల 31న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో 16 సెకన్ల నిడివిగల వార్త ప్రసారమైంది. చానల్‌ యూట్యూబ్‌ ఖాతా నుంచి వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకొని 3 నిముషాల 16 సెకన్ల కథనంగా మార్ఫింగ్‌ చేశారు. దీనిపై ఈనెల 12న జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ పరుశురాం ఫిర్యాదు చేయగా సైబర్‌ నేరం కింద పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా బాదె జయకుమార్‌, కమ్మరి శ్రీనివాసాచారి, దిడ్డి విష్ణుకుమార్‌ ఇందుకు బాధ్యులుగా తేల్చారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి సైబర్‌ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.  

Updated Date - 2021-04-17T05:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising