ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-07-27T04:25:15+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని, దళితబంధును ఇక్కడా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దళితబంధును గజ్వేల్‌లోనూ అమలు చేయాలి

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి


గజ్వేల్‌, జూలై 26: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని, దళితబంధును ఇక్కడా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌లోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌ పట్టణంలో దళితులకు రూ.30 లక్షలతో నూతన కమ్యూనిటీహాల్‌ నిర్మిస్తామని హామీఇచ్చి మరిచారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల కాలనీల్లో ఇళ్లలో గోడలు కూలుతున్నా ఒక్క అధికారి కూడా పరిశీలించలేదని వాపోయారు. ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్‌ కట్టివ్వలేదని, గజ్వేల్‌లోని బస్టాండ్‌ను కూల్చివేసి ఇప్పటివరకు నిర్మించలేదన్నారు. గజ్వేల్‌ రింగ్‌రోడ్డును ఏడు సంవత్సరాలైనా పూర్తిచేయడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మిస్తామన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని నర్సారెడ్డి సవాల్‌ విసిరారు. 



Updated Date - 2021-07-27T04:25:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising