ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్ట్‌సర్క్యూట్‌తో మూడు గుడిసెలు దగ్ధం

ABN, First Publish Date - 2021-06-22T06:06:04+05:30

షార్ట్‌ సర్క్యూట్‌తో మూడు గుడిసెలకు మంటలు అంటుకుని, గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి.

దగ్ధమైన గుడిసె, గాయపడిన ప్రవీణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిలిండర్లు పేలి రేగిన మంటలు

ఒకరికి తీవ్ర గాయాలు  

శివ్వంపేట, జూన్‌ 21: షార్ట్‌ సర్క్యూట్‌తో మూడు గుడిసెలకు మంటలు అంటుకుని, గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఈ ఘటన మండలంలోని పోతులబోగూడ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామస్థులు, బాధితుల కథనం ప్రకారం.. పోతులబొగుడలో సత్తయ్య, భిక్షపతి, శ్రీనివాస్‌ అనే వ్యక్తులు తమ కుటుంబాలతో పూరిగుడిసెల్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా గుడిసెలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. వెంటనే గుడిసెల్లోని వారంతా బయటకు వచ్చి మంటలార్పేందుకు యత్నించినప్పటికీ పక్కనే ఉన్న మరో రెండు గుడిసెలకు ఆ మంటలు వ్యాపించాయి. కాగా ఆ మంటలకు మూడు గుడిసెల్లోని గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. మంటలార్పే  యత్నంలో ప్రవీన్‌ అనే వ్యక్తికి గాయాలు కాగా అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది వెంటనే చేసుకుని మంటలను ఆర్పివేశారు. కాగా సోమవారం విషయం తెలుసుకున్న ఆర్‌ఐ కిషన్‌  వెళ్లి ఘటనపై విచారణ జరిపారు. 

Updated Date - 2021-06-22T06:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising