ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల వృత్తుల్లో పద్మశాలీలది ప్రత్యేక నైపుణ్యం

ABN, First Publish Date - 2021-01-18T05:27:54+05:30

దేశంలోని కుల, చేతి వృత్తుల వారిలో పద్మశాలీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్‌.రమణ అన్నారు.

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న రమణ, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ


సంగారెడ్డి అర్బన్‌, జనవరి 17: దేశంలోని కుల, చేతి వృత్తుల వారిలో పద్మశాలీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్‌.రమణ అన్నారు. సంగారెడ్డిలోని ఓ గార్డెన్స్‌లో ఆదివారం జిల్లా పద్మశాలీ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌.రమణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మశాలీ సంఘం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, సామాజిక తెలంగాణ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చేనేత కార్మికుల పట్ల కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సంగారెడ్డిలో పద్మశాలీ భవన నిర్మాణానికి పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అఖిల భారత సంఘం మహిళా అధ్యక్షురాలు దుశ్యంతల, రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు సోమచంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు భగవాన్‌దాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మార్కండేయ, యువజన విభాగం ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి విశ్వనాధం, రేణుక, శ్రీరాంవెంకట్‌, సతీశ్‌, వీణశ్రీనివాస్‌, సంగీత, నాగరాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-18T05:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising