ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణను ఆపాలి

ABN, First Publish Date - 2021-06-18T05:05:37+05:30

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణను ఆపాలంటూ ఓడీఎఫ్‌ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ గేటు ఎదుట నిరసన తెలుపుతున్న ఓడీఎఫ్‌ జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓడీఎఫ్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

కంది, జూన్‌ 17 : ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణను ఆపాలంటూ ఓడీఎఫ్‌ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆయుధ కర్మాగారాల కార్పొరేటీకరణకు కేంద్రం ఆమోద ముద్రవేయడాన్ని నిరసిస్తూ గురువారం కంది మండలం ఎద్దుమైలారం వద్ద ఉన్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ గేటు వద్ద జేఏసీ కార్మిక సంఘాల కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు నరే్‌షకుమార్‌, ఈశ్వరయ్య, వెంకట్‌రెడ్డి, కెవి.రాము, భాస్కర్‌, రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు అహర్నిశలు శ్రమించి సైన్యం కోసం భారీఎత్తున ఆయుధాలను అందించిన ఘనత ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ కార్మికులదేనని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్‌, బీపీఎంస్‌, ఏఐడీఎఫ్‌, ఐఎన్‌టీయూసీ, ఓఎ్‌ఫఆర్‌యూ జేఏసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising