ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-12-05T04:52:29+05:30

రైతులకు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రవన్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

రైతులతో కలిసి ఽధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నోటీసులతో రైతులకు వేధింపులు
 దుబ్బాక ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఎదుట రైతులతో కలిసి కాంగ్రెస్‌ నాయకుల ఽధర్నా


దుబ్బాక, డిసెంబరు 4: రైతులకు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రవన్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయాలని కోరుతూ శనివారం దుబ్బాక తహసీల్దార్‌కు విపతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రైతులతో కలిసి స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు కాలేదని మండిపడ్డారు. బ్యాంకు అధికారులు రుణాలను చెల్లించాలని రైతులకు నోటీ్‌సలను పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రైతుల బ్యాంకు ఖాతాలను బ్లాక్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. 

 

Updated Date - 2021-12-05T04:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising