ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివాస ప్రాంతంలోని కోళ్లఫారాన్ని తొలగించాలి

ABN, First Publish Date - 2021-03-06T05:40:18+05:30

మండలంలోని బొబ్బాయిపల్లి గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారంను తొలగించాలని గ్రామస్థులు శుక్రవారం పౌలీ్ట్ర ఫామ్‌ ఎదుట ధర్నా చేశారు.

పౌలీ్ట్ర ఫామ్‌ ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బాయిపల్లిలో పౌలీ్ట్ర ఫామ్‌ ఎదుట ధర్నా


కొండపాక, మార్చి 5 : మండలంలోని బొబ్బాయిపల్లి గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారంను తొలగించాలని గ్రామస్థులు శుక్రవారం పౌలీ్ట్ర ఫామ్‌ ఎదుట ధర్నా చేశారు. కోళ్ల ఫారం తొలగించాలని గతంలో ఎన్నిసార్లు అధికారులకు, పౌలీ్ట్ర యజమానికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రామస్థులంతా ఏకమై పౌలీ్ట్ర ఫారం వద్దకు చేరుకున్నారు. యజమాని లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే బైఠాయించారు. ఫోన్‌లో సమాచారం ఇచ్చినప్పటికీ యజమాని నిర్లక్ష్యంతో సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు పౌలీ్ట్ర ఫామ్‌కు వచ్చే మట్టి రోడ్డుపై కందకం తీసి వాహనాలు రాకుండా చేశారు. కోళ్ల ఫారంకు గేట్‌ వేశారు. వెంటనే కోళ్ల ఫారం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామానికి సమీపంలో కోళ్ల ఫారం ఉండడంవల్ల ఈగలతో గ్రామమంతా అపరిశుభ్రంగా మారి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. దుర్గంధంతో వీధులన్నీ అపరిశుభ్రంగా మారాయన్నారు. వెంటనే పౌలీ్ట్ర ఫామ్‌ను ఇక్కడి  నుంచి తరలించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు చేరుకొని గ్రామస్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. యజమానితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీత రవీందర్‌, సర్పంచ్‌ కోల శ్రీనివాస్‌, నాయకులు సంపత్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising