ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-09-17T04:51:47+05:30

క్షేత్రస్థాయిలో కాంగ్రె్‌సను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ పేర్కొన్నారు

జహీరాబాద్‌లోని మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఈనెల24న జహీరాబాద్‌లో  ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ :  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌


జహీరాబాద్‌, సెప్టెంబరు 16 : క్షేత్రస్థాయిలో కాంగ్రె్‌సను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంను గురువారం ఆయన పరిశీలించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న జహీరాబాద్‌లో ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నట్టు తెలియజేశారు. మ్యాచ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ ఉన్నతస్థాయి నేతలు పాల్గొని క్రికెట్‌ ఆడతారని వెల్లడించారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు మ్యాచ్‌ నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మ్యాచ్‌ విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు వై నరోత్తం, కోహీర్‌ జడ్పీటీసీ జి.రాందాస్‌, ఝరాసంగం ఎంపీపీ దేవయ్య, బిచ్చిరెడ్డి, మల్లన్న పటేల్‌, లాయక్‌, పాండురంగారెడ్డి, జగదీష్‌ రెడ్డి, షౌకత్‌, తసీమ్‌, షాకీర్‌ ఉస్తాద్‌, ముల్తానీ, కవేలి కృష్ణ, తాజుద్దీన్‌ మొయినుద్దీన్‌ పటేల్‌, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T04:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising