ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌జీటీ ఆదేశాలతో చెరువుల సర్వే

ABN, First Publish Date - 2021-04-23T05:00:21+05:30

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు (చెన్నై) ఆదేశాలతో తెల్లాపూర్‌లోని ప్రధాన చెరువుల సర్వేను అధికారులు ప్రారంభించారు.

వనం చెరువు నక్షాను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రాపురం, ఏప్రిల్‌ 22: నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు (చెన్నై) ఆదేశాలతో తెల్లాపూర్‌లోని ప్రధాన చెరువుల సర్వేను అధికారులు ప్రారంభించారు. తెల్లాపూర్‌లోని వనం, మేళ్ల, చెలికుంట చెరువులతో పాటు చెరువులోకి వచ్చే కాలువలను బిల్డర్లు ఆక్రమించారని, చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఎన్‌జీటీని ఆశ్రయించారు. గతంలో ఎన్‌జీటీ న్యాయవాదుల బృందం మూడు చెరువులను, కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చెరువుల సర్వేను పకడ్బందీగా చేపట్టి హద్దులు నిర్ణయించాలని ఎన్‌జీటీ స్థానిక అధికారులను ఆదేశించింది. ఎన్‌జీటీ ఆదేశాలతో కొన్ని రోజులుగా చెరువుల సర్వే కొనసాగుతుంది. కాగా గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్‌, తహసీల్దార్‌ శివకుమార్‌, ఆర్‌ఐ దీక్షిత్‌కుమార్‌, ఇరిగేషన్‌ అధికారులు సర్వేను పరిశీలించారు. 


Updated Date - 2021-04-23T05:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising