ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్‌ సాగుకు సింగూరు జలాలు

ABN, First Publish Date - 2021-07-27T03:57:01+05:30

ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా సింగూరు జలాలను సాగుకు విడుదల చేయాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ నీటి పారుదల శాఖ ఈఈ మధుసూదన్‌రెడ్డిని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటి పారుదల శాఖను కోరిన ఎమ్మెల్యే

పుల్‌కల్‌, జూలై 26: ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా సింగూరు జలాలను సాగుకు విడుదల చేయాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ నీటి పారుదల శాఖ ఈఈ మధుసూదన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన నీటి పారుదల శాఖకు లేఖ రాశారు. సింగూరు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలపై ఆధారపడిన రైతులు వరినాట్లు వేసుకుంటామని వెంటనే సింగూరు జలాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని, ఉన్నతాధికారులను సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఈఈ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-27T03:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising