అన్ని హంగులతో సిద్దిపేట బస్టాండ్
ABN, First Publish Date - 2021-03-31T05:42:37+05:30
సిద్దిపేట పాత బస్టాండ్ ముఖచిత్రం మారనున్నది. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణ ప్రాంగణం స్థానంలో అన్ని వసతులతో కొత్త బస్టాండ్‌ను నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.6 కోట్లు కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఇందులో రూ.3 కోట్లు మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే నిధుల్లో నుంచి కేటాయించగా.. మరో రూ.3 కోట్ల సీఎ్‌సఆర్ నిధులను సేకరించారు.
పాత బస్టాండ్ స్థానంలో ఆధునిక ప్రయాణ ప్రాంగణం
మంత్రి హరీశ్ చొరవతో రూ.6 కోట్లు కేటాయింపు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 30 : సిద్దిపేట పాత బస్టాండ్ ముఖచిత్రం మారనున్నది. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణ ప్రాంగణం స్థానంలో అన్ని వసతులతో కొత్త బస్టాండ్‌ను నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.6 కోట్లు కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఇందులో రూ.3 కోట్లు మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే నిధుల్లో నుంచి కేటాయించగా.. మరో రూ.3 కోట్ల సీఎ్‌సఆర్ నిధులను సేకరించారు.
హైదరాబాద్‌కు వెళ్లే చుట్టూ 10 జిల్లాల ప్రయాణికులకు సిద్దిపేట పాత బస్టాండ్ సుపరిచితం. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల బస్సులు ఈ బస్టాండ్ మీదుగానే రాజధానికి రాకపోకలు సాగిస్తుంటాయి. కామారెడ్డి, వరంగల్, జనగామ, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల బస్సులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రం కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో బస్సుల రాకపోకలకు అనువుగా బస్టాండ్‌ను ఆఽధునీకరించేలా నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవ చూపించడంతో సాధ్యపడింది. నిత్యం రద్దీతో ఉండే ఇక్కడ అత్యాధునిక బస్టాండ్‌ను నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.
Updated Date - 2021-03-31T05:42:37+05:30 IST