ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్ బెడ్రూం ఇంటిని తిరిగిచ్చేసిన మరో మహిళ

ABN, First Publish Date - 2021-01-22T14:31:34+05:30

రెండు పడకల ఇళ్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఫర్వీన్ సుల్తానా అనే మహిళ తన ఉదారత్వాన్ని చాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: రెండు పడకల ఇళ్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఫర్వీన్ సుల్తానా అనే మహిళ తన ఉదారత్వాన్ని చాటింది. పట్టణంలోని 11వ వార్డులో నివసిస్తున్న ఫర్వీన్ సుల్తానాకు సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్‌లో బ్లాకు నెంబరు 29 రూమ్ నెంబరు7లో ప్రభుత్వ రెండు పడకల ఇళ్లు మంజురైంది. మరోవైపు తన బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇళ్లు కట్టుకునే ఆలోచన వచ్చి తనకు మంజూరు అయిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే  మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో గురువారం రాత్రి కలిసిన ఫర్వీన్.. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్‌ను మరొక లబ్దిదారుకు ఇచ్చే ఆలోచనతో  ముందుకొచ్చినట్లు, అందుకు సంబంధించిన స్థల పత్రాలను మంత్రి చేతికి తిరిగి ఇచ్చేసింది. ఈ మేరకు ఫర్వీన్ సుల్తానా ఉదారత్వం చూసిన మంత్రి హరీశ్ రావు... భార్యాభర్తలను అభినందించి వారిద్దరికీ శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఇదే పట్టణానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కూడా తనకు మంజూరు అయిన డబుల్ బెడ్‌ రూం ఇంటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే.  

Updated Date - 2021-01-22T14:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising