రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు శివకుమార్, వైష్ణవి ప్రయోగాల ఎంపిక
ABN, First Publish Date - 2021-03-18T05:15:21+05:30
రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జగదేవ్‌పూర్ మండలం చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.శివకుమార్, రాయపోల్ మండలం బేగంపేట పాఠశాలకు చెందిన విద్యార్థిని వైష్ణవి చేసిన ప్రయోగం ఎంపికైంది.
జగదేవపూర్/రాయపోల్, మార్చి 17: రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జగదేవ్‌పూర్ మండలం చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.శివకుమార్, రాయపోల్ మండలం బేగంపేట పాఠశాలకు చెందిన విద్యార్థిని వైష్ణవి చేసిన ప్రయోగం ఎంపికైంది. ఈ నెల 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా జిల్లా విద్యాశాఖ వారు ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ‘టెక్నాలజీ మరియు టాయ్స్’ అనే ప్రధాన అంశంలో భాగంగా జిల్లా స్థాయి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శనలో ‘ఆరోగ్యం మరియు పరిశుభ్రత’ అనే ఉప అంశంలో విద్యార్థి శివకుమార్ రూపొందించిన ‘హైట్ అడ్జస్టబుల్ ఫుట్ ఆపరేటెడ్ యూరినల్ ఫ్లుషర్’ ఉత్తమ ప్రయోగంగా ఎంపికై మొదటి బహుమతి సాధించింది. కాగా ‘నిత్యజీవితంలో శాస్త్ర సాంకేతిక అనువర్తనం’ అనే అంశంపై వైష్ణవి ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనకు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. జిల్లా లో ప్రథమ స్థానం పొందిన వీరి ప్రయోగాలు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి జేఎన్‌ఎన్‌ఎ్‌సఎమ్ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. విద్యార్థి శివకుమార్, గైడ్ టీచర్ భాస్కర్‌రెడ్డిని ప్రధానోధ్యాయుడు శ్రీధర్‌రెడ్డి, వైష్ణవిని ఉపాధ్యాయులు అభినందించారు.
Updated Date - 2021-03-18T05:15:21+05:30 IST