ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్పైర్‌ అవార్డు పోటీలకు 10 ప్రాజెక్టుల ఎంపిక

ABN, First Publish Date - 2021-12-16T05:26:52+05:30

విద్యార్థుల్లోని పరిశోధనాశక్తిని, సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌ అవార్డు మానక్‌ 2020-21 రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి 10 ప్రాజెక్టులు ఎంపికైనట్లు డీఈవో రమే్‌షకుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి తెలిపారు.

ఉత్తమ ప్రాజెక్టుల ఫలితాలను విడుదల చేస్తున్నఅదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 15 : విద్యార్థుల్లోని పరిశోధనాశక్తిని, సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌ అవార్డు మానక్‌ 2020-21 రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి 10 ప్రాజెక్టులు ఎంపికైనట్లు డీఈవో రమే్‌షకుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలో 95 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో పోటీపడగా నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) న్యాయ నిర్ణేత బృందం 10 ప్రాజెక్టులను ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. బుధవారం ఎన్‌ఐఎఫ్‌ ఆన్‌లైన్‌ ఫలితాలను వెల్లడించగా మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికైన పది ప్రాజెక్టులను జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు నామినేట్‌ చేసినట్లు వారు తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను, గైడ్‌ టీచర్లను ఈ సందర్భంగా అభినందించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

కావ్య (జడ్పీహెచ్‌ఎస్‌ చండూర్‌), ధనుష్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ తూప్రాన్‌), ప్రశాంత్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ మక్తభూపతిపూర్‌), సాహితీ (జడ్పీహెచ్‌ఎస్‌ నాగ్సాన్‌పల్లి), మహేందర్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ కాట్రియల్‌), ఽధాత్రి (జడ్పీహెచ్‌ఎస్‌ అచ్చన్నపల్లి), సాయికిరణ్‌ (జీబీహెచ్‌ఎస్‌ మెదక్‌), శీరిష (జడ్పీహెచ్‌ఎస్‌ మంగళపర్తి), మహేష్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ రేగోడ్‌), వరుణ్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ రేగోడ్‌)లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

Updated Date - 2021-12-16T05:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising