ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డిలో నూతన పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-12T17:16:50+05:30

పట్టణంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభమైంది. శనివారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: పట్టణంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభమైంది. శనివారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్‌కు ప్రజలు రావాలంటే భయపడే స్థితి నుండి ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థ వరకు ఏర్పాటు చేసామన్నారు. ఏదైనా సంఘటన జరిగిన  నిమిషాల వ్యవధిలో పోలీసులు  బాధితులకు సహాయం అందించేందుకు 100ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పోలీసుల కోసం అధునాతన వాహనాలను, సాంకేతికతను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని చెప్పారు. పోలీస్ శాఖ బలోపేతానికి రూ.1000 కోట్లు నిధులను కేసీఆర్  మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా షీ టీం ఏర్పాటు చేసింది మన రాష్ట్రమే అని చెప్పుకొచ్చారు. దేశంలోనే పోలీసింగ్ వ్యవస్థలో తెలంగాణ రాష్టం మొదటి స్థానంలో ఉందన్నారు. నేరాల నియంత్రణకు ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిందని... దేశం మొత్తంలో ఉన్న సీసీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణాలోనే ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-12T17:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising