ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2021-09-19T04:06:17+05:30

మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ 


హుస్నాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 18: మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం పందిల్ల, పొట్లపల్లి గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను, సీసీరోడ్లు, ప్రకృతి వనాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా సంఘాలకు పావలావడ్డీ రుణాలు, రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ లకావత్‌ మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అశోక్‌బాబు, ఎంపీడీవో, సర్పంచ్‌లు తొడేటి రమేష్‌, దేవసానని సుశీల, వైస్‌ఎంపీపీ దేవసాని నిర్మల, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకునే యత్నం 


దళితబంధు పథకాన్ని హుస్నాబాద్‌లో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకునే యత్నం చేశారు. పందిల్ల, పొట్లపల్లి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఎమ్మెల్యేకు.. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బీజేపీ మండలాధ్యక్షుడు చెక్కబండి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎమ్మెల్యేకు అందజేసేందుకు కాన్వాయిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని నిలువరించారు. 


 

Updated Date - 2021-09-19T04:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising