ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూప్రాన్‌ అభివృద్ధికి రూ. 2.5 కోట్లు

ABN, First Publish Date - 2021-06-10T05:30:00+05:30

తూప్రాన్‌ పట్టణాభివృద్ధికి రూ. 2.5 కోట్ల గడ ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌

తూప్రాన్‌, జూన్‌ 10: తూప్రాన్‌ పట్టణాభివృద్ధికి రూ. 2.5 కోట్ల గడ ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలో  మరింత అభివృద్ధికి రూ. 52 కోట్లతో మరో ప్రతిపాదన చేసినట్లు ఆయన వివరించారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణంలో అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడంతోపాటు, నిధుల మంజూరుకు గానూ రెండు, మూడు రోజుల్లో కలెక్టర్‌ మున్సిపల్‌లో పర్యటించనున్నట్లు ఆయన వివరించారు. పట్టణానికి మంజూరైన రూ. 2.5 కోట్లలో రూ. 36 లక్షలు నూతన మున్సిపల్‌ భవనానికి ప్రహరీ నిర్మాణం, రూ. 49 లక్షలను వైకుంఠధామంలో మిగిలిపోయిన పనులకు కేటాయించినట్లు వివరించారు. రూ. 84 లక్షలు గ్రేన్‌ మార్కెట్‌ యార్డు కాంపౌండ్‌వాల్‌కు, రూ. 1.47 కోట్లతో ఇంటర్నల్‌ సీసీ రోడ్డు పనులకు, రూ. 19 లక్షలు సమావేశ మందిరానికి  కేటాయించినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ చెప్పారు. సమావేశంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, నాయకులు రఘుపతి, సత్యలింగం, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising