ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీనివాస్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:47:26+05:30

కరోనా మహమ్మారి మరో విలేకరిని పొట్టనపెట్టుకుంది. ఆంధ్రజ్యోతి జోగిపేట రూరల్‌ విలేకరి వూస శ్రీనివాస్‌ (50) ఆదివారం రాత్రి కరోనాతో మృతిచెందారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారు. 20 రోజులుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సపొందారు.

శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగిపేట, (వట్‌పల్లి), మే 16: కరోనా మహమ్మారి మరో విలేకరిని పొట్టనపెట్టుకుంది. ఆంధ్రజ్యోతి జోగిపేట రూరల్‌ విలేకరి వూస శ్రీనివాస్‌ (50) ఆదివారం రాత్రి కరోనాతో మృతిచెందారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారు. 20 రోజులుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సపొందారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 9న మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కోలుకుంటున్న క్రమంలో ఆదివారం ఆయన ఆకస్మికంగా మృతిచెందారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం జోగిపేట పట్టణంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీనివాస్‌ మరణంపై అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌ మృతిపై ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జున్‌గుప్త, మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య, జడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌, ఎంపీపీ అధ్యక్షుడు బాలయ్య, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు రామాగౌడ్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-17T05:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising