ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో నిలపడంతోనే ప్రజాప్రతినిధులకు గుర్తింపు

ABN, First Publish Date - 2021-11-29T05:10:57+05:30

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని బరిలో దించడంతోనే మంత్రి హరీశ్‌రావు ప్రజాప్రతినిధులను గుర్తిస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకా్‌షరెడ్డి (జగ్గారెడ్డి) పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జగ్గారెడ్డి పక్కన టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురే్‌షషెట్కార్‌, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతకు ముందు మంత్రి హరీశ్‌రావు స్థానిక సంస్థల నేతలకు 

కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు

కాంగ్రెస్‌ను గెలిపిస్తే కేసీఆర్‌ దిగొస్తారు.. నిధులు విడుదల చేస్తారు

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి 


నారాయణఖేడ్‌, నవంబరు 28: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని బరిలో దించడంతోనే మంత్రి హరీశ్‌రావు ప్రజాప్రతినిధులను గుర్తిస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకా్‌షరెడ్డి (జగ్గారెడ్డి) పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ సురే్‌షషెట్కార్‌, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డితో కలిసి జగ్గారెడ్డి మాట్లాడారు. మంత్రి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గుర్తించేవారు కాదని  కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చే వారు కాదని మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థిని రంగంలో దింపడంతో వారికి మంత్రి ఫోన్లు చేస్తున్నాడన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేసీఆర్‌ స్థానిక సంస్థల నాయకుల విషయంలో దిగొస్తారన్నారు. వారిని గౌరవిస్తూ నిధులు విడుదల చేస్తారన్నారు. స్థానిక నేతల హక్కులను కాలరాయడం ప్రమాదమని, ఈ ఎన్నికల ద్వారా ఈ విషయాన్ని కేసీఆర్‌ గుర్తిస్తారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థలకు నిధులు పుష్కలంగా ఉండేవని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కొత్తేమి కాదని దేశంలో, రాష్ట్రంలో, మెదక్‌ జిల్లాలోనూ కాంగ్రెస్‌ పార్టీదే చరిత్ర అన్నారు. సంగారెడ్డి నాందేడ్‌-అకోలా 161వ జాతీయ రహదారి విస్తరణ కాంగ్రెస్‌ హయాంలోనే మంజూరైందన్నారు. తమ పార్టీకి ఉన్న 230 ఓట్లతో పాటు టీఆర్‌ఎస్‌ వారు ఎవరైన వస్తే వారితో కూడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేయించాలని ఆయన సూచించారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆనంద్‌ స్వరూ్‌పషెట్కార్‌ నాయకులు బోజిరెడ్డి, తాహేర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T05:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising