ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేసిన కార్యకర్తలకు గుర్తింపు

ABN, First Publish Date - 2021-10-29T04:51:16+05:30

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేసిన ప్రతీ కార్యకర్తకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి అన్నారు.

భూపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 22 కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి

రామచంద్రాపురం, అక్టోబరు 28 : టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేసిన ప్రతీ కార్యకర్తకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-22 అధ్యక్షుడిగా ఎన్నికైన పరమేశ్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐలే్‌షయాదవ్‌, ఉపాధ్యక్షుడు అమృత్‌సాగర్‌, మైనార్టీ సెల్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఖాజా, నర్సింగ్‌రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి ఇతర శాఖల అధ్యక్షులు గురువారం భూపాల్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. రామచంద్రాపురం పట్టణంలోని గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం గీతాభూపాల్‌రెడ్డి కళాశాలను ఆయన పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, కూలిన ప్రహరీ, మైదానంలో పిచ్చిమొక్కలు పేరుకుపోయి, గుంతలు పడటంపై ఆయన ఆరాతీశారు. సొంత నిధులతో నిర్మించిన కళాశాలలో కార్పొరేటర్‌ స్థాయిలో వసతులు కల్పించడం తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వర్‌తో పాటు లెక్చరర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising