ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN, First Publish Date - 2021-05-08T06:02:19+05:30

రైతుల నుంచి ఽధాన్యం కొనుగోలు చేసిన వివరాలను వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని జడ్పీ సీఈవో సుమతి ఆదేశించారు.

చిన్నకోడూరులో ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నకోడూరు, మే 7 : రైతుల నుంచి ఽధాన్యం కొనుగోలు చేసిన వివరాలను వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని జడ్పీ సీఈవో సుమతి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిన్నకోడూరు, అల్లీపూర్‌, ఎల్లాయపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. రైతులు ధాన్యాన్ని  కల్లాల వద్దనే ఆరబెట్టి తీసుకురావాలని, ఆకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఏం మహిపాల్‌, సీసీ శ్రీనివాస్‌ రెడ్డి, వివోఏలు,   కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


తడిసిన ధాన్యం పరిశీలన

దుబ్బాక, మే 7: తడిసిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని  దుబ్బాక ఎంపీపీ పుష్పలత, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వనితా, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్‌, హబ్షీపూర్‌ గ్రామాలతోపాటు దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని చేర్వాపూర్‌ వార్డు, దుబ్బాక మార్కెట్‌ కమిటీలో ఆకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్‌ శ్రీలేఖ, కౌన్సిలర్లు నిమ్మ రజిత, సంధ్యారాణి, సర్పంచులు శ్రీనివాస్‌ తదితరులున్నారు.  

Updated Date - 2021-05-08T06:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising