ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-07-27T03:40:59+05:30

ప్రజావాణి ఫిర్యాదులు, వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ మీటింగ్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి చక్కని వేదిక అన్నారు.

ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


సిద్దిపేట సిటీ, జూలై 26: ప్రజావాణి ఫిర్యాదులు, వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ మీటింగ్‌హాల్‌లో సోమవారం  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి చక్కని వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లోని అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు పరిష్కరించలేకపోతే అందుకు కారణాన్ని అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించిన సమస్యలను సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులు ఆన్‌లైన్‌లో ఆప్‌డేట్‌ చేయాలని సూచించారు. దూరప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలతో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, టైన్రీ కలెక్టర్‌  ప్రపుల్‌ దేశాయ్‌, డీఆర్వో చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T03:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising