ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు శిఖం భూమి కబ్జా

ABN, First Publish Date - 2021-06-24T05:01:07+05:30

మాసాయిపేట మండలం స్టేషన్‌ మాసాయిపేట గ్రామపంచాయతీలో చెరువు శిఖం భూమిని కబ్జాచేసి ప్రహరీ నిర్మిస్తుండగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు బుధవారం అడ్డుకున్నారు.

అలుగును ధ్వంసం చేసి నిర్మించిన కల్వర్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు

వెల్దుర్తి, జూన్‌ 23 : మాసాయిపేట మండలం స్టేషన్‌ మాసాయిపేట గ్రామపంచాయతీలో చెరువు శిఖం భూమిని కబ్జాచేసి ప్రహరీ నిర్మిస్తుండగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. మాసాయిపేట రామప్ప చెరువు 44వ జాతీయ రహదారి పక్కన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి పండ్ల తోట ఉన్నది. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తి రామప్ప చెరువు శిఖం భూమిని కబ్జాచేసి ప్రహరీ నిర్మాణం చేపడుతున్నాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి, బొమ్మారం సర్పంచ్‌ శంకర్‌యాదవ్‌, స్టేషన్‌ మాస్టర్‌పేట సర్పంచ్‌ నర్సింహులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్‌ శాఖ ఈఈ శ్రీనివాస్‌ అక్కడి చేరుకుని అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. చట్ట విరుద్ధంగా మత్తడికి అడ్డంగా ప్రహరీ నిర్మించడం ఏంటని మండిపడ్డారు. వెంటనే తొలగించాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

Updated Date - 2021-06-24T05:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising