ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారంలో మొక్కలను విరివిగా నాటాలి

ABN, First Publish Date - 2021-06-18T05:02:55+05:30

హరితహారంలో భాగంగా పట్టణంలోని వార్డులలో విరివిగా మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్‌ రాజర్షిషా కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాజర్షిషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ రాజర్షిషా

సదాశివపేట/గుమ్మడిదల/నాగల్‌గిద్ద, జూన్‌ 17 : హరితహారంలో భాగంగా పట్టణంలోని వార్డులలో విరివిగా మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్‌ రాజర్షిషా కోరారు. పట్టణంలోని 1, 6, 16 వార్డుల్లో గురువారం వార్డు కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో రూ.15 లక్షలతో చేపట్టనున్న పనులకు టెండర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకంగా సిద్దాపూర్‌ కాలనీకి కొన్నినెలల నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్డు కోసం రూ.47.00 లక్షల టెండర్లను పిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, మున్సిపల్‌ కమిషర్‌ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు గుండు రవి, పిల్లోడి విశ్వనాథం పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటాలని ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ నవీన, ఎంపీటీసీ నాగేందర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ సంజీవరెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు. నాగల్‌గిద్ద మండలంలోని వల్లూర్‌, ముక్టాపూర్‌ గ్రామాల్లో హరితహారం మొక్కలను ఏపీవో మురళీకృష్ణ పరిశీలించారు. 

Updated Date - 2021-06-18T05:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising