ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్‌ జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక

ABN, First Publish Date - 2021-06-20T06:02:38+05:30

ఏడో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు.

నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరీశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టణ నర్సరీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ మున్సిపాలిటీ, జూన్‌ 19: ఏడో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో వెంకట్రావ్‌నగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను కమిషనర్‌ శ్రీహరితో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 469 నర్సరీలలో మొక్కలు నాటడానికి సిద్ధంగా  ఉన్నాయని వివరించారు. ఈ సంవత్సరం జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటేందుకు ఆదేశించామన్నారు. ప్రజలు కూడా పట్టణ పరిశుభ్రతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.     అనంతరం కలెక్టర్‌ పట్టణంలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ పార్కు వద్ద మురికి కూపాన్ని పరిశీలించారు.  మురికి నీరు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ శ్రీహరిని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట కమిషనర్‌ శ్రీహరి, డీఈ మహేష్‌, ఏఈ సిద్దేశ్వరి, కౌన్సిలర్‌ సమియొద్దిన్‌, నాయకులు  ఉన్నారు.  

Updated Date - 2021-06-20T06:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising