జ్వరసర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2021-05-25T05:55:27+05:30
జ్వరసర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జ్వరసర్వేను సోమవారం ఆయన పరిశీలించారు.
గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి
గజ్వేల్, మే 24: జ్వరసర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జ్వరసర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో జ్వరం, జలుబు, దగ్గు, ఇతర ఎలాంటి లక్షణాలు ఉన్నా తెలియజేయాలన్నారు. జ్వర సర్వేకు వచ్చే వారి ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకోవాలని, ఎలాంటి లక్షణాలున్నా కరోనా కిట్‌ను వాడాలన్నారు. 19వ వార్డులో కౌన్సిలర్ గుంటుకు శిరీషారాజు, 20వ వార్డులో కౌన్సిలర్ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జ్వరసర్వేను ప్రారంభించారు. వారివెంట మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ ఉన్నారు.
ధైర్యాన్ని మించిన మందు లేదు
సిద్దిపేట సిటీ, మే 24: ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే భయాందోళనలకు గురి కావొద్దని, ఆత్మస్థైర్యం కోల్పోకూడదని ధైర్యాన్ని మించిన మందు లేదని మున్సిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. సోమవారం సిద్దిపేటలో జరుగుతున్న ఇంటింటి జ్వరసర్వేని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు గురి కాకుండా ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడూరి సాయి, ఈశ్వర్ గౌడ్, డాక్టర్ మల్లికార్జున్, సంతోషి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-25T05:55:27+05:30 IST