ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌ఏఈ తీరుపై పంచాయతీ సభ్యుల ఆగ్రహం

ABN, First Publish Date - 2021-06-24T05:01:13+05:30

మండలంలోని గుండ్లమాచునూర్‌ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనానికి పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ సురే్‌షకుమార్‌ ఇష్టారాజ్యంగా ఎంబీ రికార్డు చేశాడంటూ పంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లె ప్రకృతివనానికి రూ.6.30 లక్షలా అంటూ మండిపాటు

హత్నూర, జూన్‌ 23: మండలంలోని గుండ్లమాచునూర్‌ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనానికి పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ సురే్‌షకుమార్‌ ఇష్టారాజ్యంగా ఎంబీ రికార్డు చేశాడంటూ పంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సర్పంచ్‌ జయంతిరెడ్డి అధ్యక్షతన పంచాయతీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామ కార్యదర్శి రామచంద్రారెడ్డి పంచాయతీ ఆదాయ వ్యయాల వివరాలు వివరిస్తుండగా, అందులో పల్లె ప్రకృతివననానికి రూ.6లక్షల30వేల వరకు చెల్లించినట్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అంతలోనే కొందరు సభ్యులు జోక్యం చేసుకొని సిమెంట్‌ కడీలు పాతి, ఇనుప జాలితో కూడిన ఫెన్సింగ్‌ వేయడానికి రూ.6లక్షల30వేలు ఎలా ఖర్చవుతాయని ప్రశ్నించారు. గతంలో కూడా సభ్యుల తీర్మానం చేయని పనులకు ఏఈ సురే్‌షకుమార్‌ ఎంబీ రికార్డు చేసి ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీరాజ్‌ ఏఈ తీరుపై కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా సర్పంచ్‌ భర్త, గ్రామ కార్యదర్శి ఇద్దరు పంచాయతీ కార్యకలాపాలను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మన్నె శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, కో-ఆప్షన్‌ నంబర్లు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-24T05:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising