ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఏసీఎస్‌ చైర్మన్‌ వేధింపులతోనే ఆత్మహత్య!

ABN, First Publish Date - 2021-10-20T04:36:20+05:30

చేర్యాల పీఏసీఎస్‌ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిగా పనిచేసిన కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల గ్రామానికి చెందిన చదరపల్లి పరశురాములు ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి మల్లిగారి యాదయ్య డిమాండ్‌ చేశారు.

పరశురాములు తల్లితండ్రులతో కలిసి మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి యాదయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పరశురాములు బలవన్మరణంపై విచారణ చేపట్టాలి

 ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి యాదయ్య


చేర్యాల, అక్టోబరు 19: చేర్యాల పీఏసీఎస్‌ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిగా పనిచేసిన కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల గ్రామానికి చెందిన చదరపల్లి పరశురాములు ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి మల్లిగారి యాదయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం చేర్యాలలో పరశురాములు తల్లిదండ్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగ చంద్రారెడ్డి వేధింపులు, పని ఒత్తిడి భరించలేక పరశురాములు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పరశురాములు సెల్‌ఫోన్‌ కాల్‌రికార్డును పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వారు న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ తమను ఆశ్రయించారని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి న్యాయవిచారణ జరిపించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆయనవెంట సనవాల ప్రసాద్‌, బండ అయిలయ్య తదితరులు ఉన్నారు.


 


Updated Date - 2021-10-20T04:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising