ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మగ్దుల్‌వాయిలో శ్మశానవాటిక స్థలం కబ్జా

ABN, First Publish Date - 2021-07-25T04:18:41+05:30

మండలంలోని మగ్దుల్‌వాయ్‌ గ్రామంలో శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కబ్జాచేసి వరి నాట్లేసిన ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవేళీఘణపూర్‌, జూలై 24: మండలంలోని మగ్దుల్‌వాయ్‌ గ్రామంలో శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మగ్దుల్‌వాయ్‌ గ్రామానికి చెందిన చాకలి శంకర్‌ అనే వ్యక్తి ప్రభుత్వ అసైన్డ్‌ భూమి సర్వే నంబరు 204/1లో గల శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాచేసి వరినాటు వేసి ముళ్లకంచె ఏర్పాటు చేశాడు. గ్రామంలో తాతముత్తాతల కాలం నుంచి ఈ భూమినే శ్మశానవాటికగా ఉపయోగిస్తున్నారు. కొంతకాలంగా చాకలి శంకర్‌ అనే వ్యక్తి ఇదే సర్వేనంబరులో 10 గుంటల భూమి తనదేనంటూ తెగేసి చెప్తున్నాడని గ్రామస్థులు వివరించారు. తహసీల్దార్‌ సైతం ఇందులో సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా సదరు వ్యక్తి పట్టించుకోవడం లేదని తెలిపారు.  తహసీల్దార్‌ దశరథంను వివరణ కోరగా ఉన్నతాధికారులకు నివేదించామని, వారి సూచన మేరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. 



Updated Date - 2021-07-25T04:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising