ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదం కాదు.. బంధువులే చంపారు!

ABN, First Publish Date - 2021-10-17T04:36:05+05:30

దౌల్తాబాద్‌కు చెందిన సిలివెరి వేణుగోపాల్‌(22) శుక్రవారం రాత్రి మెదక్‌ జిల్లా చేగుంట వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు.

దౌల్తాబాద్‌ చౌరస్తాలో ధర్నా చేస్తున్న మృతుడి బంధువులు, గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  చేగుంటలో అనుమానాస్పదంగా  యువకుడి మృతి 

 హత్య చేశారని ఆరోపిస్తూ దౌల్తాబాద్‌లో బంధువుల ధర్నా

 లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు


రాయపోల్‌, అక్టోబరు 16: దౌల్తాబాద్‌కు చెందిన సిలివెరి వేణుగోపాల్‌(22) శుక్రవారం రాత్రి మెదక్‌ జిల్లా చేగుంట వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వేణుగోపాల్‌ను హత్య చేశారని భావిస్తూ శనివారం సాయంత్రం వేణుగోపాల్‌ మృతదేహంతో దౌల్తాబాద్‌ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. సమీప బంధువులే వేణుగోపాల్‌ను హత్యచేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తొగుట సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను అరెస్టు చేసే వరకు ధర్నాను విరమించేది లేదని బంధువులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురికి గాయాలయ్యాయి. 


 

Updated Date - 2021-10-17T04:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising