ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడీవేడిగా నర్సాపూర్‌ మున్సిపల్‌ సమావేశం

ABN, First Publish Date - 2021-02-26T05:53:08+05:30

నర్సాపూర్‌ మున్సిపల్‌ సమావేశం గురువారం వాడీవేడిగా సాగింది. అధికార టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌ తీరును నిరిసిస్తూ సమావేశాన్ని బహిష్కరించడం విశేషం. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో వైస్‌చైర్మన్‌ నయీమోద్దీన్‌, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ మున్సిపల్‌ పరిధిలో కొనసాగుతున్న పలు పనుల విషయంతో పాటు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం 

కమిషనర్‌ తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు 


నర్సాపూర్‌, ఫిబ్రవరి 25 : నర్సాపూర్‌ మున్సిపల్‌ సమావేశం గురువారం వాడీవేడిగా సాగింది. అధికార టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌ తీరును నిరిసిస్తూ సమావేశాన్ని బహిష్కరించడం విశేషం. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో వైస్‌చైర్మన్‌ నయీమోద్దీన్‌, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ మున్సిపల్‌ పరిధిలో కొనసాగుతున్న పలు పనుల విషయంతో పాటు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బీజేపీ కౌన్సిలర్లు రాజేందర్‌, సురేష్‌, బుచ్చే్‌సయాదవ్‌, సునీతాబాల్‌రెడ్డి కూడా మున్సిపల్‌లో నిర్ణయాలు తమకు తెలియకుండా అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు ఇష్టానుసారంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నది. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. దీంతో చైౖర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ సమావేశం నుంచి వెల్లిపోయారు. కాగా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు పదిమంది ఉండగా లతారమే్‌షయాదవ్‌, యాదగిరి మినహా మిగతా ఎనిమిది మంది కమిషనర్‌ తీరును నిరసిస్తూ తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అనంతరం వైస్‌చైర్మన్‌ నయీమోద్దీన్‌, కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ నర్సాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌ తమకు సరైన విలువ ఇవ్వకుండా అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో తమకు సమాచారం లేకుండా పర్యటిస్తున్నాడని మండిపడ్డారు. తాము ఈ విషయమై కమిషనర్‌ను ప్రశ్నిస్తే బీజేపీ కౌన్సిలర్లు కల్పించుకుని గొడవ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మున్సిపల్‌ ఆవరణలో బీజేపీ కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మఽధ్య ఉన్న గ్రూపు విబేధాలను వారి సొంత ప్రయోజనాల కోసం మున్సిపల్‌ సమావేశంపై రుద్ది రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్ల మధ్య ఉన్న విబేధాలతో మున్సిపల్‌ సమావేశంలో గందరగోళం సృష్టించి పక్కదారి పట్టించారన్నారు. మున్సిపాలిటీకి రూ.40 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని, కేవలం ప్రకటనలకే పరిమితం తప్పా మున్సిపల్‌కు చేసిందేమీ లేదన్నారు. 


Updated Date - 2021-02-26T05:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising