ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం పంట మొత్తం ప్రభుత్వం కొంటుంది: Minister harish

ABN, First Publish Date - 2021-11-01T19:07:14+05:30

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు సోమవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 396 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరిసాగు జరిగిందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతుబంధు, ఉచిత కరెంట్ వల్లనే వరిసాగు, పంట దిగుబడి బాగా పెరిగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎండాకాలం వచ్చిందంటే రైతు పంట బోరు బావులలోనే పోయేదని... కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బోర్ల నుండి నీరు ఉబికి వస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 3 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లు నిర్మించామని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం, ఎఫ్‌సీఐ యాసంగి దొడ్డు వడ్లు, బాయిల్డ్ రైస్ కొనమని మొండికేస్తోందన్నారు. కేంద్రం నుండి దొడ్డు వడ్లు కొనమని ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు పారేసుకోవడం కాదు కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కొనేలా ఒప్పించాలని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంట మొత్తం కొంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, సీపీ జోయల్ డేవిస్ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T19:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising